Kidnap Case: సికింద్రాబాద్ లో కిడ్నాప్ అయినా బాలుడు కథ సుఖాంతంగా మారింది. కిడ్నాప్ అయిన బాలుడ్ని చాకచక్యంగా కాపాడి, తండ్రి వద్దకు చేర్చారు పోలీసులు. మాదాపూర్ ఏరియాలో బాలుడిని ఉన్నట్లు గమనించిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. కిడ్నాపర్లు సైబర్ టవర్స్ వద్ద బాలుడిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులను గమనించిన కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిద్దరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలను కిడ్నాప్ చేసారు? అని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలుడు కిడ్నాప్ అయిన కొన్ని గంటల్లోనే పోలీసులు ఆచూకి తెలుసుకున్నారు. బాలుడిని సురక్షితంగా కాపాడి తండ్రికి అప్పగించారు. పిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకోవాలని సూచించారు. పిల్లల ప్రతి కదలికలను కనిపెడుతూ ఉండాలని, పిల్లల విషయంలో తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాలని కోరుతున్నారు. రెప్పవాలితే కిడ్నాపర్లు పిల్లలపై పంజా విసురుతున్నారని, అలర్ట్ గా ఉండాలని కోరారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలాపురానికి చెందిన దుర్గేష్ తన ఐదేళ్ల కుమారుడు శివ సాయితో కలిసి తిరుమలకు వెళ్లాడు. ఈ నెల 28న తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ రోజు ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన దుర్గేష్ అలసిపోయి స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30 గంటల సమయంలో 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లో బ్యాగులతో పాటు కుమారుడిని వదిలి వాష్‌రూమ్‌కు వెళ్లాడు దుర్గేష్. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. కంగారు పడిన దుర్గేష్ స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. కానీ బాలుడి మానసిక పరిస్థితి బాగా లేదని దుర్గేష్ చెప్పాడు. అయితే రైల్వే స్టేషన్‌లో దుర్గేష్, అతని కుమారుడి కదలికలను గమనించిన వ్యక్తులే ఈ కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని, బాలుడి కిడ్నాప్ వెనుక మరాఠా బెగ్గింగ్ మాఫియా హస్తం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.
పాతబస్తీ ఫలక్ నుమాలో మరో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని ఓ వక్తి కిడ్నాప్ చేసాడు. కిడ్నాప్ అయిన బాలుడు 5 ఏళ్ల అయాన్ ను గా గుర్తించారు. ఇంటి నుండి నడుచుకుంటూ వస్తున్న బాలుడుని గుర్తుతెలియని వ్యక్తి తీసుకోని వెళ్తునట్టు సీసీ ఫోటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఫలక్ నుమా ఫలక్నుమా పోలీస్ లకు తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ కోసం ఐదు బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు.
Minister KTR: స్కామ్‌ల వారసత్వంతో కాంగ్రెస్ స్కాంగ్రెస్‌గా మారిపోయింది