వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడులకు దిగారు. అయితే ఈ సారి ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా? దళితులను మోసం చేయడం ఎలా?వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?
Read Also: కేంద్రంపై నిప్పులు చెరిగిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా?ఉద్యమకారులను తొక్కేయడం ఎలా? ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా? పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? అంటూ కేటీఆర్‌పై తీవ్ర దాడులకు దిగారు. పండగ పూట సంబరాలు చేసుకోవాల్సిన రైతులు ఇంకా ధాన్యం కుప్పల కాడ కాపలా ఉంటుండు.వడ్లు ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తుండు. చివరి గింజ వరకు కొంటానన్న ప్రభుత్వం వరి కోసి 3 నెలలైనా ఇంకా కొనకపోవడంతో,అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే,చావే శరణ్యం అని చావు బాట పడుతుండు రైతు. అంటూ షర్మిల ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌ను ప్రభుత్వాన్ని నిలదీశారు.
తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..
— YS Sharmila (@realyssharmila) January 14, 2022
మద్యం అమ్మకాలను పెంచడం ఎలా?
ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్ కు బానిస చెయ్యడం ఎలా?రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా చేయడం ఎలా?1/2 pic.twitter.com/i9kPk7TU7n
దళితులను మోసం చేయడం ఎలా?వరి వేసిన వాళ్లకు ఉరి వేయడం ఎలా?ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టడం ఎలా?ఉద్యమకారులను తొక్కేయడం ఎలా?ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం ఎలా?పార్టీ లీడర్లు తప్పులు చేస్తే కాపాడుకోవడం ఎలా? వీటికైతే బాగా సమాధానం చెప్పగలరు కదా చిన్న దొరగారు? #AskKTR 2/2
— YS Sharmila (@realyssharmila) January 14, 2022
పండగ పూట సంబరాలు చేసుకోవాల్సిన రైతు ఇంకా ధాన్యం కుప్పల కాడ కాపలా ఉంటుండు.వడ్లు ఎప్పుడు కొంటారా అని కండ్లల్లో వత్తులు వేసుకొని చూస్తుండు.
— YS Sharmila (@realyssharmila) January 14, 2022
చివరి గింజ వరకు కొంటానన్న ప్రభుత్వం వరి కోసి 3 నెలలైనా ఇంకా కొనకపోవడంతో,
అకాల వర్షానికి ధాన్యం తడిసిపోతే,చావే శరణ్యం అని చావు బాట పడుతుండు రైతు pic.twitter.com/Cr86DAp5oV