కేంద్రంపై నిప్పులు చెరిగిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఇటీవల కేంద్రం ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత గోస పెడతారా…? పండగ పూట ఎరువుల ధరలు 50% నుండి 100% కు పెంచుతారా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర బీజేపీ నాయకులు పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. రైతుల ప్రయోజనం కోసం కేంద్రంలోని బీజేపీ చేసింది శూన్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిందేనన్నారు. దేశ రైతాంగం కేసీఆర్‌ కోసం ఎదురుచూస్తున్నదని, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర రైతన్నలు ఆలోచన చేయాలన్నారు.

Related Articles

Latest Articles