Uttam Kumar Reddy: కాళేశ్వరం గురించి మాట్లాడాలి అంటే.. కామన్ సెన్స్ ఉండాలని నీటిపారుదల, పౌరసరఫరాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. షేమ్ గా ఫిల్ అవ్వాల్సింది పోయి ..ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడన్నారు. కేసీఆర్ మాటలు వికారంగా ఉన్నాయన్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని, నువ్వు కట్టిన ప్రాజెక్టు.. నీ హయాంలో కూలింది.. సిగ్గు పడు అన్నారు. మేడిగడ్డ నుండి నీళ్ళు వదిలింది కేసీఆర్ ప్రభుతం అన్నారు. ఇప్పుడు మామీద నిందలు వేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు ఎక్కడ కూలిపోతుందో అని నీళ్లు కిందకు వదిలింది నువ్వు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: MI vs RR Dream 11 Prediction: ముంబై vs గుజరాత్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
23 టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలేసింది కేసీఆర్ హయాంలోనే అన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగించింది కేసీఆర్ అని మండిపడ్డారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వం అని చెప్పింది మేము అంటూ క్లారిటీ ఇచ్చారు. వ ర్షాలు తక్కువ పడ్డాయి.. నీళ్లు తక్కువ ఉన్నాయన్నారు. రైతులను ఆదుకోవడానికి ,వేసవి లో మంచి నీటి కోసం ప్లాన్ చేస్తున్నామన్నారు. జూరాలలో 154 tmc ఇన్ ఫ్లో, 2022 లో 1229 tmc వచ్చిందన్నారు.
Read also: Babu Mohan: బీజేపీ పార్టీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు.. బాబుమోహన్ కీలక వ్యాఖ్యలు..
ఇది ప్రకృతి కరువా.. మేము తెచ్చిన కరువా ? అని ప్రశ్నించారు. కేసీఆర్.. జగన్ దోస్తీతో నీళ్లు దోపిడీ జరిగిందన్నారు. AP కృష్ణ నీళ్లు దోచుకుంటు ఉన్నా.. నోరు మెదపని నేత కేసీఆర్ అంటూ మండిపడ్డారు. పోలీసు శాఖను ఎక్కువ ఉపయోగించుకుంది నువ్వు, ఫోన్ ట్యాపింగ్ చేసింది నువ్వు, ఇప్పుడు పోలీసులు న్యూట్రల్ గా ఉండాలి అంటున్నాడని అన్నారు. రైతుల ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పథకాలు కోడ్ సమయంలో అమలు కావు, బోనస్ పై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు.
Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రెస్ మీట్ లో పవర్ కట్ లేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు..