Babu Mohan: బీజెపి పార్టీ వారు నాకు టికెట్ ఇస్తాను అని చెప్పి ఇవ్వలేదని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన ప్రెస్ మీట్ బాబు మోహన్ మాట్లాడుతూ.. వరంగల్ కి ఎప్పడు వచ్చిన కరుణపురం నా అడ్డా అని అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మొదటి సారిగా కరుణపురం చర్చికి వెళ్లడం జరిగిందన్నారు. వరంగల్ కి నాకు చిన్నప్పటినుండి అనుభవం ఉందన్నారు. నేను పుట్టింది వరంగల్ లోనే అని తెలిపారు. బీజేపీ పార్టీ వారు నాకు టికెట్ ఇస్తాను అన్ని చెప్పి టికెట్ ఇవ్వలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Congress: సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు బిగ్ రిలీఫ్..
నేను వరంగల్ ఎంపీ అభ్యర్థి గా ప్రజా శాంతి పార్టీ నుంచే పోటీ చేస్తా అని అన్నారు. నేను వేరే ఏ పార్టీ నుండి పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి చీప్ రాజకీయలు చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పుట్టిన వరంగల్ లో శెభాష్ అనిపించుకునేలాగా ప్రజలకు సేవ చెస్తా అన్నారు. వరంగల్ ప్రజలు నన్ను గెలిపించాలని, మంచి చేయాలనీ ఉద్దెశంతో పోటీ చేస్తున్న అన్నారు. కేసీఆర్ లాగా కే.ఎల్. పాల్ అబద్ధాలు చెప్పరని అన్నారు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం నేను గెలిచాక ఇప్పిస్తా అన్నారు. పేదవారికి అందరికీ ఉచిత పింఛన్లు ఇప్పిస్తా అన్నారు.
Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు