Uttam Kumar Reddy: కేసీఆర్ ప్రెస్ మీట్ జనరేటర్ మీద పెట్టారని, కరెంట్ పోయింది అని తప్పుడు మాటలు చెబుతున్నారని నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరేటర్ ఆగిపోతే కూడ మాదేన తప్పు అని మండిపడ్డారు. మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. Ntpc 4000 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేస్తున్నారని, 1600 మెగావాట్లే చేస్తుందన్నారు. టీఆర్ఎస్, ఎన్టీపీసీకి కోఆపరేట్ చెసి ఉంటే.. 4 వేళా మెగావాట్ల పవర్ ఉండేది మన చేతిలో అని క్లారిటీ ఇచ్చారు.
Read also: JEE main admit card: జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డును పొందండి ఇలా..!
యాదాద్రికి ఎక్కడ నష్టం అవుతుందో అని ఎన్టీపీసీకి కేసీఆర్ సహకరించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రతి మాట అబద్ధమే అన్నారు. వాస్తవాలు వక్రీకరీంచండం ఆయనకే దక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెస్టేషన్ లో కేసీఆర్ వున్నాడని, ప్రభుత్వం పోయింది..పార్టీ కూడా పోతుంది అనే భయం ఆయనకు ఉందని అన్నారు. పొంకణాలకు పోయి… ఉనికి లేకుండా మారింది పార్టీ అంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్, వీఆర్ఎస్ అవుతుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరవత బీఆర్ఎస్ మిగలదన్నారు. బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు తప్పా ఎవరు ఉండరన్నారు.
Read also: Harish Rao: టెట్ ఫీజులు తగ్గించకపోతే పోరాటం చేస్తాం.. సీఎంకు హరీష్ రావు లేఖ
కేసీఆర్ ఎప్పుడైనా.. రైతుల దగ్గరికి పోయాడా? అని ప్రశ్నించారు. ప్రెస్టీషన్ లో రైతుల దగ్గరికి పోయాడని తెలిపారు. రాష్ట్రంలో 7149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతీ గింజ కొంటామని, మిల్లర్లు ఎంఎస్పీ కంటే తక్కువ కొంటె చర్యలు తప్పవని అన్నారు. రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పంట నష్టం పథకం రద్దు చేసుకున్నారని అన్నారు. వరద వస్తే రైతులకు పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఎన్నికల ముందు రెండు జిల్లాల్లో డ్రామా చేశాడు.. అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు రైతులకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశారు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. సిగ్గుపడాలి, తలవంచుకోవాలని అన్నారు. ఇంత దోపిడీ దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు.
Read also: Lok Sabha Elections 2024: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం..?
కాళేశ్వరం గురించి మాట్లాడాలి అంటే..కామన్ సెన్స్ ఉండాలని తెలిపారు. షేమ్ గా ఫిల్ అవ్వాల్సింది పోయి ..ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడన్నారు. కేసీఆర్ మాటలు వికారంగా ఉన్నాయన్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని, నువ్వు కట్టిన ప్రాజెక్టు.. నీ హయాంలో కూలింది.. సిగ్గు పడు అన్నారు. మేడిగడ్డ నుండి నీళ్ళు వదిలింది కేసీఆర్ ప్రభుతం అన్నారు. ఇప్పుడు మామీద నిందలు వేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు ఎక్కడ కూలిపోతుందో అని నీళ్లు కిందకు వదిలింది నువ్వు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 టీఎంసీల నీళ్లు సముద్రంలో వదిలేసింది కేసీఆర్ హయాంలోనే అన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టు అప్పగించింది కేసీఆర్ అని మండిపడ్డారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వం అని చెప్పింది మేము అంటూ క్లారిటీ ఇచ్చారు.
Kurchi Madatha Petti: అమెరికా స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా మన డామినేషనేరా చారి..!