Jagga reddy: నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని జగ్గారెడ్డి వెల్లడించారు. తన ఫేస్ బుక్ పేజీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి రకరకాల పోస్టులు పెడుతున్నారని జగ్గారెడ్డి వివరించారు.