ఈ రోజుల్లో క్రికెట్ బెట్టింగ్ బారిన పడి.. ఎంతో మంది అప్పుల పాలవుతున్నారు. కొందరు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ డబ్బులు పొగొట్టుకుని.. ఓయో రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువకుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also: Health Benefits: రోజు రెండు గుడ్లు తినడం వల్ల..బాడీకి ఎలాంటి లాభాలుంటాయో మీకు తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం…
CM Revanth Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై…
Patancheru : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ పేలుడు సంభవించడంతో పరిశ్రమ తునాతునకలైపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉదయం 9 గంటల సమయంలో సీగాచి కెమికల్స్‌లో పని సాగుతున్న సమయంలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి కంపెనీ…
వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తే.. పదోపరకు ఆదాయం వస్తుందని, పంటతోపాటు పంట చేనులో గంజాయి మొక్కలు సాగిస్తే లక్షల లాభం గడించవచ్చునని భావించిన వ్యక్తికి సంగారెడ్డిలో ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 25000 జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
Jagga reddy: నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయిందని జగ్గారెడ్డి వెల్లడించారు. తన ఫేస్ బుక్ పేజీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేసి రకరకాల పోస్టులు పెడుతున్నారని జగ్గారెడ్డి వివరించారు.
Harish Rao: కేంద్ర ప్రభుత్వ రంగాల్లో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అమ్మడం దారుణమన్నారు.