Auto workers strike in Yadagirigutta: యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. యాదాద్రి జిల్లా ఆలయ పునర్నిర్మాణం తర్వాత స్థానిక ఆటోలను కొండపైకి అధికారులు అనుమతించలేదని మండిపడ్డారు. దీంతో కొండపైకి స్థానిక ఆటోలను అనుమతించాలని స్థానిక ఆటో డ్రైవర్లు చాలాకాలంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆటో కార్మికులను కొండపైకి అనుమతించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. అయితే ఈ ధర్నాకు మద్దతుగా ధర్నా స్థలం వద్దకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క కూర్చున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు జరిగేది అభివృద్ధి… కానీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పుణ్య నిర్మాణం తర్వాత స్థానిక ఆటో కార్మికులు ఉపాధి కోల్పోవడం బాధాకరమన్నారు భట్టి విక్రమార్క. కొండపైకి ఆటోలను అనుమతి ఇవ్వద్దని ప్రభుత్వం, స్థానిక అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మండిపడ్డారు. కొండపైకి ఆటోలను అనుమతి ఇచ్చెలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
Read also: Indrakaran reddy: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో కార్మికుల సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వేడుకుంటున్నామన్నారు భట్టి విక్రమార్క. కారు ఉంటే తప్ప యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహా స్వామిని దర్శించుకునే అవకాశం లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట అత్యంత పవిత్రమైన ప్రదేశమన్నారు. సీఎం యాదగిరిగుట్ట దేవుడిని యాదాద్రీ శ్రీ లక్ష్మీనారసింహాస్వామిగా ఖరీదైన దేవుడిగా మార్చినారని తెలిపారు. అహాంకారంతో విర్రవీగేవారినీ ఎలా దండించాలో శ్రీ లక్ష్మీనారసింహాస్వామికి తెలుసని తెలిపారు. స్దానిక యువత జీవనోపాది కోసం నడుపుకునే ఆటోలను కొండపైకి అనుమతి ఇవ్వకపోవడం భాదాకరమని తెలిపారు. ఆనిర్ణయం యువకుల ఉపాధి అవకాశాలను కొల్పోయేలా చేయడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పద్దతిలో కొండపైనే భక్తులు రాత్రి సమయంలో నిద్రించే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పునుద్దరిస్తామని తెలిపారు.
Telangana Rains: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్