Tamilnadu : తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు చిన్నారులను చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడికట్టిన నిందుతులంతా మైనర్లే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని విళుపురం జిల్లాకు చెందిన జానకీపూరం సమీపంలో నివసించే ఓ చిన్నారి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. ప్రతీ రోజూ ఎంతో ఉత్సాహంతో సరదాగా బడికి వెళ్తుండేది ఆ చిన్నారి. ఇలా వెళ్తున్న క్రమంలో ఒక రోజు సడన్ గా ఆ చిన్నారి అనారోగ్యం పాలైంది. చిన్నారికి ఏం జరిగిందని మహిళా టీచర్ ఆరా తీసింది. గమనించిన టీచర్ బాలిక లైంగిక దాడికి గురైనట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె ఆ జిల్లా బాలల భద్రతాధికారికి తెలియజేసింది.
Read Also: Indrakaran reddy: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారు
సమాచారం అందుకున్న అధికారి అక్కడికి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ముండియంబాక్కం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ ఘటనపై అధికారులు, పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో బాలిక నివసించే ప్రాంతంలోనే ఉండే 14-17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నలుగురు మైనర్లు చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టినట్టు తెలిసింది. అంతే కాకుండా.. పోలీసుల విచారణలో మరో భయంకర నిజం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితులు ఈ ఒక్క చిన్నారిపైనే కాకుండా మరో నలుగురు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తేలింది. పోలీసులు ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందుతులైన నలుగురిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: VD 12 : ఎట్టకేలకు విజయ్ – గౌతమ్ .. రెడీ.. కెమెరా.. యాక్షన్