V.C. Sajjanar: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా సజ్జనార్ ఉంటారు. ఆర్టీసీ ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు.. ఆర్టీసీ కార్మికులు చేసిన మంచి పనులను ట్వీట్ చేసి వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. అలాగే సైబర్ నేరాలు, సమాజంలో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కొన్నిసార్లు వీడియోలను షేర్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ఇటీవల షేర్ చేసిన సజ్జనార్ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని రోడ్డు ప్రమాదాలు అజాగ్రత్తతో జరుగుతుండగా, మరికొన్ని పాదచారుల పరధ్యానంతో జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Read also: Ponguleti-Jupally: రాజధానిలో పొంగులేటి, జూపల్లి.. రాహుల్ తో భేటీ
ఆ వీడియోలో ఓ యువతి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆగుతుంది. కొంత పరధ్యానం కారణంగా నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా.. ఇంతలో వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొట్టింది. మరో ఘటనలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి బస్సు వస్తున్నా.. భయం లేకుండా నిర్లక్ష్యంగా రోడ్డు దాటే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బస్సు వేగంగా వెళ్లి అతడిని ఢీకొట్టింది. ఈ రెండు ఘటనల వీడియోలను సజ్జనార్ షేర్ చేశారు. పాదచారుల అజాగ్రత్తే ఈ ప్రమాదాలకు కారణమని అన్నారు. త్వరగా వెళ్లాలనే ఆత్రుతతో అటుఇటు చూడకుండా రోడ్డు దాటుతున్నారన్నారు. పరధ్యానం వల్ల ప్రమాదాలకు గురవుతూ తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాదచారులకు కొన్ని సూచనలు చేశారు.
Read also: Father: తండ్రి ప్రేమ మరి..! తుపాకీతో కాల్చిన కొడుకు.. నాన్న వాంగ్మూలం చూస్నే కన్నీళ్లు ఆగవంతే..
*పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి*
1. పాదచారులు ఫుట్‌పాత్‌లనే ఉపయోగించుకోవాలి. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు.
2. జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారు. రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలి.
3. జీబ్రాలైన్ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్ చేయాలి. పరధ్యానంలో అసలే ఉండొద్దు.
4. పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలి.
5. సెల్‌ఫోన్, హియర్ ఫోన్స్ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హరన్ వినపడదు.
6. రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
7. జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాలని సజ్జనార్ ట్విటర్ ద్వారా సూచించారు.
హైదరాబాద్‌లో ఇటీవల ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలకు కారణం పాదచారుల అజాగ్రత్తే. తొందరగా వెళ్లాలనే ఆత్రంలో అటుఇటు చూసుకోకుండా రోడ్డు దాటుతున్నారు. పరధ్యానంతో ప్రమాదాలకు తావిస్తూ.. తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
*పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి*
1.… pic.twitter.com/93t4lAqqNo
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 26, 2023