నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. వేడుకల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా, చట్ట పరిమితులను అతిక్రమించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నుండి నూతన సంవత్సర వేడుకల వరకు కొనసాగేలా భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. Waste-to-Energy: వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలు – ఏపీ డిస్కం మధ్య కుదిరిన ఎంవోయూ ముఖ్యంగా పబ్బులు, హోటళ్ల…
CP VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే కాకుండా, ప్రమాదాల వల్ల సంభవించే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపి, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే వాహనదారులపై ఉక్కుపాదం మోపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, రాబోయే క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని,…
VC Sajjanar: హైదరాబాద్ మహానగర పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని నగర సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బుధవారం మూడు కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం…
CP Sajjanar : హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి…
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ జోయిస్ డేవిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
VC Sajjanar: హైదరాబాద్ మహానగరంలోని చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో జరిగిన కాల్పుల ఘటన స్థలాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీతో పాటు క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించారు. ఇక ఈ ఘటనపై సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటన ఈరోజు సాయంత్రం 5 గంటలకు చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద జరిగిందని ఆయన తెలిపారు.…
VC Sajjanar : రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రాం రీల్స్‌లో క్రమంగా వీడియోలను తొలగించాయి. Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్…
VC Sajjanar: సోషల్ మీడియాలో ‘వ్యూస్’ కోసం పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్న వారిపై ఐపీఎస్ అధికారి పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో అసభ్యకరమైన కంటెంట్ సృష్టించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ X (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ చేశారు. వ్యూస్, లైక్స్‌తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్‌ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ…
Safe Ride Challenge: పౌరుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనర్ తాజాగా #SafeRideChallenge అనే సోషల్ మీడియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రోడ్డు భద్రతను వైరల్ ట్రెండ్‌గా మార్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా.. వాహనదారులు ప్రయాణం ప్రారంభించే ముందు హెల్మెట్ ధరించడం లేదా సీట్‌బెల్ట్ కట్టుకోవడం వంటి భద్రతా చర్యలను చూపిస్తూ ఒక చిన్న వీడియో లేదా ఫోటో తీసి, ముగ్గురు స్నేహితులను…
Chiranjeevi : హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ కాసేపు శాంతిభద్రతలు, హైదరాబాద్ సమస్యల గురించి మాట్లాడుకున్నారు. సజ్జనార్ కు చిరంజీవితో ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరూ అనేక అంశాలపై అవేర్ నెస్ కల్పించారు. మొన్నటి వరకు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సేవలందించారు. ఇప్పుడు మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడంతో చిరంజీవి…