Ponguleti-Jupally: ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుల భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ తో జరిగే సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో జూపల్లి, పొంగులేటి వర్గాలకు చెందిన కొందరు ముఖ్య అనుచరులు కూడా పాల్గొన్నారు. రాహుల్‌తో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు మరికొందరు ముఖ్య నేతలు భేటీ అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Read also: Uppal Skywalk: ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
ఇక అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. ఈనేపథ్యంలో దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా కాంగ్రెస్ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరినా.. ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ జూపల్లి తన ఇంటికి చేరబోతున్నారు. పొంగులేటితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Read also: TS Schools: నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్..! ABVP పిలుపు..?
ఇక అదే సమయంలో జూపల్లి, పొంగులేటి చేరికతో ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతలను కూడా ఢిల్లీ నుంచి పిలిపించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరే విషయమై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ తర్వాత ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో సభలు నిర్వహించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పొంగులేటి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ సభలకు రాహుల్ గాంధీ హాజరవుతారా? లేక ప్రియాంక గాంధీ టీ కాంగ్రెస్‌కు హాజరవుతారా? జూపల్లి, పొంగులేటి ఢిల్లీ పర్యటన అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.
Rythu Bandhu: నేటి నుంచే ఖాతాల్లో రైతు బంధు నగదు.. పదకొండో విడత సాయానికి సర్కారు సిద్ధం