రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి మళ్ళీ వెనక్కి వస్తే బీ ఫామ్ ఇస్తామని, అందరం రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని, పార్టీ సీనియర్ నేతలందరం ఆయన కోసం పని చేస్తామని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి జిల్లాలో పాదయాత్ర సంర్భంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెనర్.. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించారు. బీజేపీలో కండువా కప్పుకున్నప్పుడే పండగ అని విమర్శించారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు బీజేపీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని గుర్తుచేశారు. అద్వానీ, వెంకయ్య నాయుడు పరిస్థితి మీరందరూ చూస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. వెనక్కి వస్తే రాజగోపాల్ రెడ్డికి బీ ఫామ్ ఇస్తామని ప్రకటించారు. అందరం రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటామని రేవంత్ తెలిపారు. పార్టీ సీనియర్ నేతలందరం రాజగోపాల్ రెడ్డి కోసం పని చేస్తామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరీంచని, తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చామని విమర్శించే మోడీ తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.
అయితే.. రేపు అమిత్ షా భారీ బహిరంగ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువాకప్పుకోనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ లోకి మళ్ళీ వెనక్కి వస్తే బీ ఫామ్ ఇస్తామని టీపీసీసీ రేవంత్ రెడ్డి మీడిమాద్వారా ప్రకటించడం సంచళనంగా మారింది. మరి దీనిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందించనున్నారు. పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్టంలో ప్రజలు మునుగోడు వైపు చూస్తున్నారని తెలిపారు. సాయుద పోరాటానికి మునుగోడు చిరునామా అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాత్ర కీలకంమని, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ వివక్షకు గురవుతుందని అన్నారు. కేసిఆర్ మునుగోడు సమస్యలకు పరిష్కారం చూపలేదని గుర్తుచేశారు. పోడుభూముల సమస్య పరిష్కారం కాలేదని మండిపడ్డారు. రోడ్లు అధ్వాన్నంగా, సాగు, తాగు నీటి సమస్య పరిష్కారం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కేసీఆర్ అవలంభించిన పద్ధతులనే అమలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు.
Revanth Reddy: అమ్ముడుపోయిన ప్రతివాడు సిద్ధాంతాలు చెప్పడం ఫ్యాషన్ గా మారింది