CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
- బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
- 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్లు
- అప్పుల ఊబిలో తెలంగాణను బీఆర్ఎస్ నెట్టేసిందన్న సీఎం
- అఘోరా పూజలపై రేవంత్ సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పెన్షన్లు అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన, కాంగ్రెస్ పాలనలోనే మహిళలకు తగిన గౌరవం , సంక్షేమం సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మహిళలకు కేబినెట్లో మంత్రి పదవే ఇవ్వని నాయకులు, ఈ రోజు తమ ప్రభుత్వం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నాటి పాలకులు చేసిన తప్పులకు మహిళలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు.
ఉద్యోగాల భర్తీ వర్సెస్ పేపర్ లీకేజీలు
నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో పేపర్లు అమ్ముకుని యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే దాదాపు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, దానికిదనంగా మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి శవాల పునాదులపై మళ్లీ అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, పెట్రోల్ బాటిళ్లు పట్టుకుని డ్రామాలు ఆడే ‘అగ్గిపెట్టే రావు, అఘోరా రావు’ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.
Also Read
- CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
‘విధ్వంసం నుంచి వికాసం వైపు..’ అప్పుల ఊబిలో తెలంగాణ
కేసీఆర్ పాలనలో పూర్తిగా విధ్వంసమైన తెలంగాణను తాము వికాసం వైపు నడిపించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఊహించని అప్పులకు నెలకు వేల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లిస్తూనే, అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నామని వివరించారు. కొన్ని సంక్షేమ ఫలాలు అందడంలో పూట ఆలస్యం కావచ్చు కానీ, ప్రజల హక్కులకు ఎక్కడా భంగం కలగనివ్వమని హామీ ఇచ్చారు. దేశంలోనే మొదటిసారిగా ప్రజా సంక్షేమం కోసం శాస్త్రీయంగా కులగణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, 2034 వరకు ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వానికే ఉండాలని కోరారు.
చేతబడులు, అఘోరా పూజల సంచలన ఆరోపణలు
ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, కొందరు నాయకులు రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు నష్టపోవాలని కోరుకుంటూ అఘోరా పూజలు చేయించారని విమర్శించారు. నాటి పాలకులు శివమొగ్గ దేవాలయంలో , తమిళనాడులోని క్షుద్ర పూజల కేంద్రాలలో నిర్వహించిన అఘోరా పూజల వెనుక ఉన్న నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనపై, పీసీసీ అధ్యక్షుడిపై చేతబడులు చేయించినా పర్వాలేదు కానీ, రాష్ట్ర ప్రజల కీడును కోరుకుంటూ పూజలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సొంత బావమరిదే కేసీఆర్‌పై చేతబడి చేశాడంటూ ప్రచారం చేసుకుంటున్న తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?