Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
- Xiaomi 18 Pro, 18 Pro Max కోసం కొత్త Pocket Guitar యాక్సెసరీ
- ఫోన్ వెనుక సెకండరీ డిస్ప్లేను ఉపయోగించుకునేలా ఈ యాక్సెసరీ
- బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో Xiaomi Pocket Guitar అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Pocket Guitar: షియోమీ నుండి కొత్తగా లాంచ్ అయినా Xiaomi 18 Pro, 18 Pro Max స్మార్ట్ఫోన్ల కోసం ఓ వినూత్న యాక్సెసరీని తీసుకొచ్చింది. దాని పేరు “షియోమీ ప్యాకెట్ గిటార్ (Xiaomi Pocket Guitar)”. ఫోన్ వెనుక భాగంలో ఉన్న సెకండరీ డిస్ప్లేను ఉపయోగించుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్ గిటార్‌ను బలమైన మాగ్నెట్ ద్వారా ఫోన్ వెనుక భాగానికి అమర్చుకోవచ్చు.
ఫోన్‌కు అమర్చినప్పుడు ఈ యాక్సెసరీ సెకండరీ డిస్ప్లేపైకి వస్తుంది. దీన్ని తెరిస్తే మధ్యలోని హింజ్ చుట్టూ రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకవైపు I నుంచి VII వరకు నంబర్లతో కూడిన కార్డ్ బటన్లు ఉంటాయి. మరోవైపు గిటార్ స్ట్రింగ్స్లా పనిచేసే రిడ్జ్లతో కూడిన టెక్స్చర్డ్ ప్యానెల్ ఉంటుంది. అంతేకాదు.. దీన్ని మరో వైపు మడిచి చిన్న ఫోన్ స్టాండ్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.
Also Read
- iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
- రూ.1.3 లక్షల విలువైన iPhone 17 Pro.. కేవలం రూ.56 వేలకే.. ఆఫర్ ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- POVA New Mobile: POVA 8 5G మొబైల్ ఫోన్ లాంచ్.. 8000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ ఫ్లాట్ LCD స్క్రీన్..
బ్లూటూత్‌తో ఫోన్‌కు కనెక్ట్
ఈ షియోమీ ప్యాకెట్ గిటార్.. చైనాకు చెందిన Changba కరోకే, సింగింగ్ యాప్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేసిన తర్వాత యాప్‌లోని ప్రత్యేక పెర్ఫార్మెన్స్ విభాగంలోకి వెళ్లి రెండు మోడ్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అందులో “చోర్డ్ మోడ్ Chord Mode”లో ఎడమ చేతితో I నుంచి VII వరకు ఉన్న కార్డ్ బటన్లను ప్రెస్ చేస్తూ, కుడి చేతితో టెక్స్చర్డ్ ప్యానెల్‌పై స్ట్రమ్ చేయాలి. “రిథమ్ మోడ్ Rhythm Mode”లో సరైన కార్డులను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సరైన రిథమ్‌లో స్ట్రమ్ చేస్తే యాప్ మిగిలిన పనిని చూసుకుంటుంది.
వెనుక డిస్ప్లే ఎందుకు?
ఈ యాక్సెసరీలో ఫోన్ వెనుక డిస్ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్ట్రమ్మింగ్ చేసే భాగం డిస్ప్లేకు కింద ఉండేలా డిజైన్ చేయడంతో.. గిటార్ వాయిస్తున్నప్పుడు చేతితో స్క్రీన్ కనిపించకుండా పోదు. దీంతో చేతిని పక్కకు జరపాల్సిన అవసరం లేకుండా స్క్రీన్‌పై కంట్రోల్స్, ఇతర సమాచారాన్ని చూడవచ్చు. అయితే ఈ రియర్ డిస్ప్లే ఫీచర్లు Xiaomi 18 Pro సిరీస్ ఫోన్లకే పరిమితం. ఇతర Xiaomi ఫోన్లు, iOS 14 లేదా ఆ తర్వాతి వెర్షన్‌తో పనిచేసే ఐఫోన్ లలో కూడా ప్యాకెట్ గిటార్ ను Changbaకు కనెక్ట్ చేయవచ్చు. అయితే వెనుక స్క్రీన్ ఆధారిత పెర్ఫార్మెన్స్, రికార్డింగ్ ఫీచర్లు అందుబాటులో ఉండవు. అలాంటి ఫోన్లలో ప్లే చేయడం, పాటలు బ్రౌజ్ చేయడం, ట్యూనింగ్ వంటి పనులను ముందు డిస్ప్లే ద్వారానే చేయాలి.
ధర ఎంతంటే?
ఇందులో 630mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 30 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని షియోమీ చెబుతోంది. ఛార్జింగ్ కోసం USB Type-C పోర్ట్, ఫోన్‌కు కనెక్ట్ కావడానికి బ్లూటూత్ కనెక్టివిటీని అందించారు. చైనాలో దీని ధరను 599 యువాన్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.7,500 వరకు ఉంటుంది. ప్రస్తుతం చైనాలో JD.com ద్వారా ఈ యాక్సెసరీని అమ్మనున్నారు.
తాజావార్తలు
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!