Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్, బెంగళూరు కేంద్రంగా ఉన్న జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొనుగోలుకు సంబంధించి తుది దశ చర్చలు జరుపుతోంది. ఈ లావాదేవీని నగదు బదులుగా షేర్ స్వాప్ పద్ధతిలో నిర్వహించాలని భావిస్తున్నారు. జనా ఎస్ఎఫ్బీ షేరు విలువను రూ. 620-650 మధ్య, ఫెడరల్ బ్యాంక్ షేరు విలువను రూ. 350గా అంచనా వేస్తూ షేర్ల మార్పిడి నిష్పత్తిపై చర్చలు జరుగుతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 82,000 కోట్లు కాగా, జనా ఎస్ఎఫ్బీ మార్కెట్ విలువ దాదాపు రూ. 5,600 కోట్లుగా ఉంది.
ఈ ఒప్పందం విజయవంతంగా పూర్తయితే.. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్వతంత్ర బ్యాంకుగా తన ఉనికిని కోల్పోతుంది. దీని ఆస్తులు, బాధ్యతలు పూర్తిగా ఫెడరల్ బ్యాంకులో విలీనం అవుతాయి. అంతేకాక.. జనా హోల్డింగ్స్‌లో కీలక పెట్టుబడిదారుగా ఉన్న టీపీజీ సంస్థ ఈ డీల్ ద్వారా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఫెడరల్ బ్యాంకుకు మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో బలపడటంతో పాటు, ముఖ్యంగా ఉత్తర, మధ్య భారత దేశాల్లో తక్కువ ఆదాయ వర్గాలకు తమ సేవలను విస్తరించేందుకు ఈ నెట్వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్బీఐ ప్రాధాన్య రంగ రుణ నిబంధనలను సులభంగా చేరుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.
Also Read
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
అయితే ఈ విలీనంలో ప్రధాన సవాల్ ఉద్యోగుల సర్దుబాటే. ఫెడరల్ బ్యాంకులో 17,000 మంది ఉద్యోగులు ఉండగా, జనా ఎస్ఎఫ్బీలో అంతకంటే ఎక్కువగా 26,000 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మైక్రోఫైనాన్స్ ఫీల్డ్ కార్యకలాపాల్లో పనిచేస్తున్నవారే. జనా ఎస్ఎఫ్బీ లోన్ పోర్ట్‌ఫోలియో చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంఖ్య మాత్రం భారీగా ఉండటంతో ఈ హెచ్ఆర్ విభాగాన్ని, సిబ్బందిని సర్దుబాటు చేయడం ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాల్‌గా మారింది. హెచ్ఆర్ ఇంటిగ్రేషన్ , కార్యాచరణ అంశాలపై సరైన పరిష్కారం లభిస్తేనే డీల్ పూర్తిగా ముందుకు వెళ్లనుంది. ఈ విలీన ప్రక్రియపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు.. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి , ఎల్ఐసీకి ఉన్న 60.72 శాతం వాటాను విక్రయించే ప్రక్రియ నడుస్తోంది. ఈ వాటాల కొనుగోలు కోసం ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ NBD వంటి సంస్థలు సవరించిన బిడ్స్‌ను దాఖలు చేశాయి. ప్రభుత్వం ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను పరిశీలిస్తోంది. త్వరలో దీనిపై కూడా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?