Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
- హార్దిక్ పాండ్యాకు కొత్తగా కుడి కాలి కింది భాగంలో గాయం
- కనీసం మూడు వారాల పాటు పోటీ క్రికెట్‌కు హార్దిక్ దూరంగా
- ఆస్ట్రేలియా-Aతో అక్టోబర్ 6 నుంచి జరిగే వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరమయ్యే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరోసారి గాయం అయింది. అతడి కుడి కాలి కింది భాగంలో కొత్తగా గాయం గుర్తించారు. దీంతో కనీసం మూడు వారాల పాటు పోటీ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగే వైట్‌బాల్ సిరీస్‌కు కూడా హార్దిక్ అందుబాటులో ఉండే అవకాశం లేకుండా పోనుంది.
హార్దిక్ పాండ్యా ‘రిటర్న్ టు ప్లే’ తేదీని సెప్టెంబర్ 20గా నిర్ణయించారు. దీంతో అక్టోబర్ 6 నుంచి ఆస్ట్రేలియా-Aతో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత్-A జట్టులో అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే తాజాగా నిర్వహించిన స్కాన్లలో కుడి కాలి కింది భాగంలో గాయం బయటపడింది. బీసీసీఐ వైద్య బృందం రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించింది.
Also Read
- Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
- OTR: తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కట్టు తప్పుతోందా? పీసీసీ పిలిచినా నో రియాక్షన్!
- AP HRC: "నాలుగు వారాల్లో నివేదిక సమర్పించండి".. రాప్తాడు ఘటనను సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ
- AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు సంబంధించిన పరిణామాలను పరిశీలిస్తున్న ఓ అధికారి ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. బీసీసీఐ మెడికల్ ప్యానెల్ అధిపతి డాక్టర్ దిన్షా పార్డీవాలా హార్దిక్ వైద్య నివేదికలను పరిశీలించినట్లు తెలిపారు. ఆయన జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్‌ను పరీక్షించి, రిహాబిలిటేషన్ ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 22 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ జరగనుంది. ప్రస్తుత గాయం కారణంగా అప్పటికి హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ఆసియా గేమ్స్ కోసం భారత బృందంతో హార్దిక్‌ను జపాన్‌కు పంపించాలని బీసీసీఐ తొలుత భావించింది. ఇందుకోసం బీసీసీఐ ఆపరేషన్స్ బృందం అతడి పాస్‌పోర్ట్‌ను కూడా వీసా సంబంధిత పనుల కోసం తీసుకుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా హార్దిక్ మోకాలి ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. దీంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న హార్దిక్.. ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందేందుకు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి నొప్పి వచ్చింది. స్కాన్లు చేయించగా గాయం ఉన్నట్లు తేలింది. ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి బెంగళూరులోనే ఉంటున్న హార్దిక్.. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ పొందుతున్నాడు.
అయితే గత నాలుగు నెలల్లోనే హార్దిక్‌కు పలుమార్లు గాయాలు ఇబ్బంది పెట్టాయి. ఆఫ్ఘనిస్థాన్ వన్డేలు, ఇంగ్లండ్ టీ20లు, ఇప్పుడు ఆస్ట్రేలియా-A సిరీస్‌కు ముందు అతడు చిన్నచిన్న గాయాలకు గురయ్యాడు. దీంతో అతడి పునరాగమనానికి అవి అడ్డంకిగా మారుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ కూడా మిస్ అయ్యే పరిస్థితులు ఉండడంతో.. ఫిట్‌గా ఉంటే జింబాబ్వే వన్డేలతో పునరాగమనం చేసే అవకాశం ఉంది. లేదంటే విజయ్ హజారే ట్రోఫీ లేదా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడటం ద్వారా తన ఫిట్నెస్ను పరీక్షించుకునే అవకాశం కలుగుతుంది.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!