CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్లో దివంగత మాజీ ప్రధాన మంత్రి, దేశమే గర్వించదగిన గొప్ప రాజనీతిజ్ఞుడు మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను, ఆర్థిక సంస్కరణలను కొనియాడారు. పీవీ నరసింహారావుతో కలిసి ఆయన చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలే దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేడు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి పునాది వేశాయని గుర్తుచేశారు. దేశ జీడీపీలో ఐదు శాతం ఆదాయాన్ని సమకూర్చే సంస్థలు అన్నీ హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు.
Also Read
- Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
- India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
- AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!
- Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్రను స్మరించుకుంటూ.. రాష్ట్ర స్వరాష్ట్ర ఆకాంక్షను నిజం చేస్తూ తెలంగాణ బిల్లుపై ఆయన చేసిన సంతకం సువర్ణాక్షరాలతో లిఖించదగినదని, విగ్రహం వద్ద ఆ సంతకాన్ని కూడా నిక్షిప్తం చేశామని తెలిపారు. జాతీయ స్థాయిలో నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంబినేషన్ దేశానికి స్వేచ్ఛను ఇస్తే.. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కాంబినేషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు పేదలకు ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, పకడ్బందీ పునరావాస చట్టాలను తెచ్చిందని కొనియాడారు.
మౌనమే భాషగా మార్చుకుని దేశాభివృద్ధికి నిస్వార్థంగా సేవలందించిన మన్మోహన్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం వెంటనే ‘భారతరత్న’ ప్రకటించాలని, ఢిల్లీలో ఆయన పేరు మీద ఒక స్మారక భవనం, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో కలిసి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!
-
Jagga Reddy: సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తా.. అప్పుడే రిలీజ్ చేస్తా..
-
Sam Pitroda Praises PM Modi: ప్రధాని మోడీపై సామ్ పిట్రోడా ప్రశంసలు.. ‘దయగల, కష్టపడే వ్యక్తి’ అంటూ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..