In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇన సర్వీస్ ఉపాధ్యాయులకు మరో కీలక అప్డేట్ వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టెట్ (TGTET) రెండో విడత నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరచడం, వారికి సకాలంలో పదోన్నతులు, అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా రెండుసార్లు ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఇప్పటికే మొదటి విడత టెట్‌ను విజయవంతంగా నిర్వహించి, తాజాగా నేడు వాటికి సంబంధించిన ఫలితాలను కూడా విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.
ఈ తాజా ఫలితాల ప్రకటన ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాతిరేకాలను నింపుతోంది. టెట్ లో అర్హత సాధించలేని వారికి ఇది మరొక అవకాశం అని చెప్పవచ్చు. అయితే మొదటి విడత టెట్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 1న వెలువడనున్న రెండో విడత నోటిఫికేషన్‌పైనే కేంద్రీకృతమైంది.
Also Read
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
ఈ స్పెషల్ టీజీటీ ఇన్‌సర్వీస్ టీచర్స్-2026 రెండో విడత ఆన్లైన్ పరీక్షలను నవంబర్ 16 నుంచి నవంబర్ 21 వరకు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత సాధించిన ఉపాధ్యాయులు తమ కెరీర్ పురోగతికి బాటలు వేసుకోవడానికి ఇదొక చక్కటి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుండగా, ఉపాధ్యాయులు పరీక్షకు సిద్ధం కావాలని విద్యాశాఖ సూచించింది.
తాజావార్తలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?