CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- జ్ఞానేష్ కుమార్‌ను తొలగించేందుకు ప్రతిపక్షాల ప్రయత్నం..
- సీఈసీ తొలగించడం అంత ఈజీ కాదు..
- సుప్రీంకోర్టు జడ్జి తరహాలోనే తొలగించే విధానం..
- పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింత రెండొంతుల మద్దతు ఉంటేనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కేంద్రంగా దేశ రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. ఇటీవల, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో.. ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ సహా ఓటర్ల నమోదు, తొలగింపు వంటి ప్రక్రియల్లో గత 10 నెలల్లో 14 సార్లు మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పింది. అయితే, అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు సాధారణమని, చివరకు అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగానే ప్రకటించినట్లు ఈసీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ విజయానికి సహాయపడేలా ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాక్రోచ్ పార్టీ సీజేపీ రాజీనామాకు 48 గంటల డెడ్‌లైన్ విధించింది. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా భారీగా ఉద్యమిస్తామని హెచ్చరించింది.
Also Read
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
నిజానికి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే CECను కూడా తొలగించాలి. ఆయన చెడుగా ప్రవర్తిస్తున్నారని నిరూపించబడాలి లేదా అసమర్ధుడిగా రుజువు కావాలి. అలాంటి సమయంలో మాత్రమే ఒక ప్రక్రియ ద్వారా ఆయనను తొలగించవచ్చు. భారతదేశ చరిత్రలో ఈ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించలేదు.
నోటీసుతో ప్రక్రియ మొదలు..
సీఈసీని తొలగించాలంటే ముందుగా లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది ఎంపీల సంతకాలు అవసరం. ఆ తర్వాత లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఈ నోటీసులు స్వీకరించాలా? వద్దా? అని నిర్ణయిస్తారు. వాస్తవాల ఆధారంగా నోటీసు స్వీకరించిన తర్వాతే రెండో దశ మొదలవుతుంది.
నోటీస్ ఆమోదిస్తే..
నోటీసుల్ని ఆమోదిస్తే విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఒకరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నుంచి, ఒకరు హైకోర్టు న్యాయమూర్తి, మరొకరు ప్రముఖ న్యాయనిపుణులు ఉంటారు. ఆరోపణలపై కమిటీ విచారణ చేపడుతుంది. ఆధారాలు పరిశీలిస్తుంది. సీఈసీ ఆరోపణలపై సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
పార్లమెంట్లో ఓటింగ్..
విచారణ తర్వాత ఆరోపణలు నిజమయ్యాయని నిరూపితమైతే, పార్లమెంట్ ముందుకు నివేదిక వెళ్తుంది. సీఈసీ తొలగింపు తీర్మానంపై ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితే, రాష్ట్రపతి తుది ఆమోదం ఇస్తారు. అప్పుడే సీఈసీ తన పదవి నుంచి తొలగింపబడుతారు.
తాజావార్తలు
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..