Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియాగం చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని, ఇది ఖచ్చితంగా దశాబ్ది దగా నే అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేసారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read also: Andhra Pradesh: సినిమాను మించిన క్రైమ్ స్టోరీ..చాలెంజ్ చేసి పగ తీర్చుకుంది..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో కార్యక్రమాలు చేపట్టడంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను నిరసనలు చేపట్టకుండా అడ్డుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు పోలీసులు. మాజీ ఎల్.ఓ.పి. షబ్బీర్ అలీని హైదరాబాద్ లో ఆయన నివాసంలో బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్బీనగర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దశాబ్ది దగా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అదుపులో తీసుకున్నారు.
Nikhil: వారం రోజుల్లో సినిమా రిలీజ్… ప్రమోషన్స్ మాత్రం చాలా వీక్