సినిమాల్లో కథలు గమ్మత్తుగా ఉంటాయి.. సినిమాలో చివరికి హీరోను గెలిపించడానికి డైరెక్టర్ కొత్తగా జిమ్మిక్కులు చేసి కథను సుఖాంతం చేస్తాడు.. కొన్ని సినిమా కథలు ప్రేమతో ఉంటే, మరికొన్ని పగతో రగిలే వాళ్ళు ఎలా ఉంటారు చివరికి వాళ్ల పంతాన్ని ఎలా పూర్తి చేస్తారు అనేది ఒక ప్లాన్ ప్రకారం చూపిస్తారు.. ఆ అంశం సినిమాకు హైలెట్ అవుతుంది.. అదే స్టోరీ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.. ఓ మహిళా తన కొడుకును చంపిన అందరిని వరుసగా చంపేసింది.. చివరికి పోలీసుల విచారణలో అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది..
పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట. పల్నాడు పగ, ప్రతీకారాలకు పెట్టింది పేరు. ఒక్కసారి శపథం చేశారంటే.. ఆ మాటకు కట్టుబడి ఉంటారన్న విషయం తెలిసిందే..నర్సరావుపేట పట్టణంలోని ఎస్ ఆర్ కే టీ కాలనీలో జాన్‌బీ అనే మహిళ నివసిస్తుండేది. అదే కాలనీలో ఉండే బాజీతో వివాహేతర సంబంధం ఉంది. బాజీ పై రౌడీ షీట్ ఉంది. ఈ వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న జాన్‌బీ కొడుకు సుభానికి తెలిసింది. దీంతో బాజీ ఆస్తిలో వాటా కావాలంటూ సుభానీ వేధించడం మొదలు పెట్టాడు..వేధింపులు తట్టుకోలేని బాజీ ఒకరోజు సుభానీకి మద్యం పోయించి హత్య చేశాడు. పాల వ్యానులో మృతదేహాన్ని పడేశాడు. ఈ విషయం తెలుసుకున్న జాన్ బీ.. బాజీతో గొడవ పడింది. తన కొడుకు అడ్రస్ చెప్పాలంటూ గట్టిగా ప్రశ్నించింది. దీంతో బాజీ సుభానీని చంపినట్లు ఒప్పుకొని మృతదేహాన్ని చూపించాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన జాన్ బి కన్నీరు మున్నీరుగా విలపించింది..
తన కొడుకు చావుకు ఎవరైతే కారణం అయ్యారో వారందరిని చంపి పగ తీర్చుకుంటున్నాని చెప్పింది.. అదే విధంగా సినిమా పక్కీ లో ఒక్కొక్కరిని చంపింది..ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో గడిపివచ్చింది. అనంతరం తన కొడుకును పొట్టన పెట్టుకున్న బాజీని హత్య చేసేందుకు సిద్దమైంది. నిన్న ఒంటరిగా దొరికిన బాజీ కళ్ళలో కారం కొట్టి మరీ చంపేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు.. కానీ స్థానికులు చూడటంతో శవం పై మట్టి పోసి అక్కడి నుంచి ఉడాయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను అరెస్ట్ చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..