CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
- కేసీఆర్‌పై రేవంత్ ఫైర్
- మోదీ, బీజేపీపై విమర్శలు
- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
- ఇచ్చిన మాట నిలబెడతానన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : శిల్పకళావేదిక వేదికగా జరిగిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకుల తీరును ఎండగడుతూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బకాసురుడిని తీసుకెళ్లి ఫార్మ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “ఆయన అన్నీ మీకే చేశాడని, మళ్లీ అధికారంలోకి రావాలని అంటున్నాడు. అసలు మనకేం చేశాడు? మళ్లీ ఎందుకు వస్తాడు?” అని సీఎం ప్రశ్నించారు. గత పదేళ్లలో అగ్రికల్చర్, హార్టికల్చర్లను పూర్తిగా పక్కనపెట్టేసి, రాష్ట్రంలో ‘డ్రింకింగ్ కల్చర్’ (మద్యం సంస్కృతి) తీసుకువచ్చారని మండిపడ్డారు.
మోదీ ఉద్యోగాలు ఇచ్చింది కిషన్ రెడ్డి, బండి సంజయ్లకే
ఇదే వేదికపై నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై కూడా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ, ఆ ఉద్యోగాలు ఎవరికిచ్చారని నిలదీశారు. ఇక్కడ ఇద్దరికే ఉద్యోగాలు వచ్చాయని, వారు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అని ఎద్దేవా చేశారు. “అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాబట్టి మీ పప్పులు ఉడికాయి. బెంగాల్లో గెలవడానికి మీకు 15 ఏళ్లు పట్టింది. కానీ ఇక్కడికి మీరా వచ్చేది? ఇక్కడ మావాళ్లు ఉన్నారు, దంచి కొడతారు” అంటూ తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించారు.
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఫోన్లు ట్యాప్ చేసిన సిగ్గుమాలిన బతుకు.. నీ అయ్యా జాగీరా?
బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “దిగిపోవడానికి ఇది నీ అయ్యా జాగీరా? మేము మీకేం బానిసలం కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రైతులను వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్, ఆయన మాత్రం ఫార్మ్‌హౌస్‌లో వడ్లు పండించి ఏకంగా 4200 క్వింటాళ్లు అమ్ముకున్నాడని ఆరోపించారు. సొంత బిడ్డ, అల్లుడి ఫోన్లను కూడా విన్న చరిత్ర కేసీఆర్‌దని, ఇంతకంటే సిగ్గుమాలిన బతుకు ఇంకేముంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అబద్ధాలు చెప్పను.. చెప్పింది చేస్తా
రాష్ట్రంలో కొత్త సంసారాన్ని (ప్రభుత్వాన్ని) సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుందని, అలాగని సంసారాన్ని నడిబజారులో పెట్టుకోలేమని సీఎం పేర్కొన్నారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, కేవలం ఇచ్చిన మాటే శాశ్వతంగా ఉంటుందని.. నాడు ఇందిరమ్మ, ఎన్టీఆర్ లాంటి మహానాయకులే ఓడిపోయారని గుర్తుచేశారు. “నేను అబద్ధాలు చెప్పను, చెప్పింది చేసి తీరుతా. ప్రజలకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్లే చెప్తాను” అని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలది, రైతులది, ఆడబిడ్డలది అని భరోసా ఇచ్చారు. కేసీఆర్ లాంటి తప్పుడు పనులు తాను ఎప్పటికీ చేయనని చెప్తూ.. “ఆ పశుపతిని (కేసీఆర్‌ను) నీ ఫార్మ్‌హౌస్‌లోనే బంధించాను, ఇక బయటకు రానిచ్చే ప్రసక్తే లేదు” అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
తాజావార్తలు
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!