తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి టీఆర్‌ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఖమ్మంలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని ఆమె హెచ్చరించారు. 26న ఖమ్మం వెళ్తున్న అందరి సంగతి తెల్చుతానని ఆమె వెల్లడించారు. పువ్వాడ అజయ్ తన గోతి తాను తీసుకున్నారని, మంత్రిగా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్..పువ్వాడ బిజినెస్ పార్టనర్‌లు అని, కేటీఆర్ అండతో పువ్వాడ రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. ఏసీపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైందని, ఓ వైపు కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే… పువ్వాడ కేకులు కట్ చేసి వేడుకలు చేసుకుంటున్నారని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. దేవుడికి కిలో బంగారం ఇచ్చాడు.. దేవుడికి బంగారం ఇచ్చినంత మాత్రానా.. పాపం పోదు, నా వల్ల తప్పు జరిగిందనే భావన కూడా లేదని ఆమె పువ్వాడ అజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.