మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన మండిపడ్డారు. మాకు కుల, మతల ఫీలింగ్స్ లేవు అని పేర్కొన్నారు. ఈ బాబ్రీ మసీదు కూల్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా.. ధర్మపురి అర్వింద్ తో చేతులు కలిపి ఎమ్మెల్సీ కవితమ్మను ఓడించలేదా అని ఆయన ప్రశ్నించారు.
రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పర్యటన ఉంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నాలుగు నియోజక వర్గాలలో ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లిలో మంత్రుల పర్యాటనలు జరుగనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
ఖమ్మం జిల్లా చీమలపాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈనేపథ్యంలో ఇవాల (గురువారం) ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం ఖమ్మంకు వెళ్లారు. సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి, సీఎంఓ కార్యాలయం నుంచి కొంతమంది అధికారులు ఇచ్చే అదేశాల ప్రకారమే ఖమ్మం పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నా చావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారణం అంటూ సాయి చెప్పాడని .. మరణ వాంగ్మూలం తీసుకోవాలని డాక్టర్‌లు కుడా సమాచారం…
రైతుల సౌకర్యార్థం అవకాశం ఉన్న ప్రతి చోట వ్యవసాయ మార్కెట్ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా…
ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరుపున రూ. 8లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. అంతేకాకుండా సాయి గణేష్ కుటుంబానిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి గణేష్ ని తెచ్చి ఇవ్వలేక పోయాన అండగా ఉంటామన్నారు. సాయి గణేష్ మృతి చాలా దురదృష్టకరమని, ఇది నిజాం రాజ్యం కాదు…కుటుంబ రాజకీయాలు తెలంగాణ లో తెస్తామంటే ఒప్పు కోరన్నారు. హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టారు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి గణేష్ ఆత్మహత్యపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మహా సంగ్రామ యాత్రలో ఉన్న.. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకారమని ఆయన అన్నారు. టీఆర్ఎస్, మంత్రి, పోలీసులు సాయి గణేష్‌ను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. సాయి గణేష్‌ది ప్రభుత్వ హత్య అని ఆయన మండిపడ్డారు. కాషాయం జెండా రెపరెపల కోసం సాయి గణేష్ కృషి చేశాడని, ప్రజాస్వామ్య బద్దకంగా, న్యాయ పోరాటం చేశాడన్నారు. అక్రమ…