Renuka Chowdary: ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా.. రేణుక చౌదరి సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renuka Chowdary: ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా.. అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుక చౌదరి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం కొనసాగుతుంది. ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ విజయ భేరి బహిరంగ సభపై పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఇన్చార్జిగా మహమ్మద్ ఆరిఫ్ నసీం ఖాన్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వి.హెచ్ హనుమంత్ రావు, మాజీ మంత్రి రేణుక చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక చౌదరి మాట్లాడుతూ.. 40 ఏళ్లు పని చేసిన వాళ్ళకి కాంగ్రెస్ లో గుర్తింపు రాలేదని రేణుకా చౌదరి అన్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితి వుందని, అన్యాయం జరిగేందుకు అవకాశం వుందని తెలిపారు.
ఎవ్వడేమి చేసిన ఖమ్మం కాంగ్రెస్ జిల్లా ఎవ్వరికీ సీటు ఇచ్చిన మోసం చేసిన గెలిచిన వారికి బుద్ది చెబుదామని తెలిపారు. ఎటువంటి వారికి ఈ పార్టీలో స్థానం లేదు.. ముస్తఫా వంటి వారికి అన్యాయం చేస్తే స్పందించే వాళ్ళు వుండరని తెలిపారు. మూడు సింహాల టోపీ లు పెట్టుకుని అధికార పార్టీ తొత్తులుగా మారుతున్నారని అన్నారు. బీజేపీ కేసీఆర్ వేరెవరూ కాదు… రాబందులు చాలా మంది వున్నారని తెలిపారు. బయట గల్లా పెట్టుకుందాం.. ఇక్కడ అందరం ఒక్కటే నినాదంగా వుండాలని తెలిపారు. నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉందని అన్నారు. 40 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదని అన్నారు. ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు బ్రదర్స్ గాలి మారిపోయింది .. రాబోయేది కాంగ్రెస్ ఉండబోయేది కాంగ్రెస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై పువ్వాడ అజయ్ కుమార్ ఎలా స్పందిస్తారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Ponguleti: పార్టీకి నష్టం కలిగించొద్దు.. ఇప్పటికే పలుచన అవుతున్నాం
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!