Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్, తన తాజా పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ ప్రీ-రిలీజ్ వేదికపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బ్రిటీష్ పాలన నాటి చీకటి కోణాలు, రాయలసీమ గడ్డ చరిత్రను ప్రస్తావిస్తూనే… హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యక్తిగత బంధంపై ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈ వేడుకలో రాహుల్ సంకృత్యన్ పంచుకున్న ఓ వ్యక్తిగత విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలపై ఆయన మాట్లాడుతూ— “ఈ చిత్రంలో విజయ్, రష్మిక భార్యాభర్తలుగా కనిపిస్తారు. రష్మిక ఇందులో ‘జయమ్మ’ అనే అద్భుతమైన పాత్రను పోషించింది. అయితే, షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తయ్యేంత వరకూ వాళ్లిద్దరూ నిజ జీవితంలోనూ పెళ్లి చేసుకోబోతున్నారనే సంగతి నాకు అస్సలు తెలియదు! అప్పటికే మా కథ ప్రకారం స్క్రీన్‌పై వారి వివాహ సన్నివేశాన్ని చిత్రీకరించి, ఆ పోస్టర్‌ను కూడా విడుదల చేశాం. సెట్లో ఆ జంటను చూసి అందరూ ఎంతో ముచ్చటపడ్డారు” అంటూ రివీల్ చేయడం సంచలనంగా మారింది. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని దాటి నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్న ఈ స్టార్ పెయిర్ ప్రస్తావన ఈవెంట్లోనే హైలైట్‌గా నిలిచింది.
సినిమా నేపథ్యాన్ని వివరిస్తూ బ్రిటీష్ పాలనపై, విద్యా విధానంపై రాహుల్ తీవ్రస్థాయిలో స్పందించారు. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలి తీరితే ప్రాణం నిలుస్తుంది, లేదంటే మరణమే. సరిగ్గా ఈ ఆకలినే అస్త్రంగా మార్చుకుని పరాయి పాలకులు మనల్ని 250 ఏళ్లపాటు బానిసలుగా పాలించారు.” “మన పాఠ్యపుస్తకాలు సైతం అసలైన చరిత్రను మనకు చూపించలేదు. ఎవరో వక్రీకరించిన చరిత్రను నమ్ముతూ మనం మనల్ని తక్కువ చేసుకుని బతుకుతున్నాం. నిజమైన మన గత వైభవం తెలిస్తే మనం ఎంతటి ఘనులమో అర్థమవుతుంది. ఆ చేదు నిజాన్ని తెలుసుకున్నప్పుడు తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయ్యాను. అలాంటి చరిత్రను మన ప్రజల ముందుకు తీసుకురావాలన్న సంకల్పమే ‘రణబాలి’.” రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ పోరాట యోధుని కథకు సరైన కటౌట్ విజయ్ దేవరకొండ మాత్రమేనని దర్శకుడు స్పష్టం చేశారు. ‘టాక్సీవాలా’ తర్వాత మళ్లీ విజయ్‌తో పనిచేయడం గర్వంగా ఉందని, రాయలసీమ యాసను పలకడం చాలా కష్టమైనప్పటికీ విజయ్ తన డైలాగ్ డెలివరీతో రణబాలి పాత్రకు ప్రాణం పోశాడని ప్రశంసించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలపై ప్రశంసలు కురిపిస్తూ, సినిమాకు ‘U/A’ సర్టిఫికెట్ వచ్చిందని, మన మూలాలను, మరుగునపడిన నిజాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ పిల్లలతో కలిసి ‘రణబాలి’ని చూడాలని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ పిలుపునిచ్చారు.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
తాజావార్తలు
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!