Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన బార్ల నోటిఫికేషన్‌కు అపూర్వ స్పందన లభించింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా , స్థానిక పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని మున్సిపాలిటీలు , కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 27 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం కొత్తగా 41 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఊహించని విధంగా ఈ పరిమిత సంఖ్యలోని బార్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుదారులు పోటెత్తడంతో ఎక్సైజ్ శాఖకు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి.
జీహెచ్ఎంసీ శివారు ప్రాంతాల్లో పోటాపోటీగా దరఖాస్తులు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 కొత్త బార్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకంగా 8,771 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దీని ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ. 87.71 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా క్యూర్ (GHMC & ORR) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లోని 14 కొత్త బార్ల కోసం ఏకంగా 4,252 దరఖాస్తులు రావడం అందరినీ విస్మయానికి గురిచేశాయి. అలాగే వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని మరో 27 బార్ల కోసం కూడా ఏకంగా 4,519 దరఖాస్తులు దాఖలు కావడం గమనార్హం.
Also Read
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
వివిధ జిల్లాల్లోనూ కొనసాగిన జోరు.. ప్రధాన ప్రాంతాల్లో భారీగా అప్లికేషన్లు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మున్సిపాలిటీలు , మండల కేంద్రాల్లోనూ కొత్త బార్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని బార్‌కు 207 దరఖాస్తులు రాగా, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలోని అలియాబాద్‌లో 201, మూడుచింతలపల్లిలోని రెండు బార్లకు 112, యెల్లంపేట్లోని రెండు బార్లకు 225 దరఖాస్తులు వచ్చాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 357, ఖమ్మం జిల్లా కల్లూరులో 325, మహబూబ్‌నగర్‌లో 78, మక్తల్‌లో 38, దేవరకద్రలో 90, మద్దూర్‌లో 58 దరఖాస్తులు దాఖలయ్యాయి.
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో 112, గుమ్మడిదలలోని రెండు బార్లకు 287, కోహిర్లో 127 దరఖాస్తులు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 19, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 90, ఫ్యూచర్ సిటీ పరిధిలోని చేవెళ్లలో 279, మొయినాబాద్‌లోని రెండు బార్లకు ఏకంగా 664 దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో 27, పరిగిలో 36, వరంగల్ రూరల్ నర్సంపేటలో 131, స్టేషన్ ఘన్‌పూర్‌లో 349 దరఖాస్తులు సమర్పించారు. అలాగే మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 331, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో 376 చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. మొత్తంగా వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
41 బార్ల కోసం ఏకంగా 8,771 దరఖాస్తులు#
దరఖాస్తుల ఫీజుతో ప్రభుత్వానికి రూ.87.71 కోట్ల ఆదాయం#
హైదరాబాద్ శివారు బార్ల కోసం భారీ పోటీ#
మొయినాబాద్‌లో రెండు బార్లకు 664 దరఖాస్తులు
తాజావార్తలు
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!