AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DSC 2026 Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. DSC-2026 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2,721 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేసి, బ్రీఫ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్‌ను నవంబర్ 3, 2026లోపు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నియామకాల్లో జనరల్ స్కూళ్లకు సంబంధించి 2,111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 350 పోస్టులు, సొసైటీలు, ఇతర యాజమాన్యాల పరిధిలో 260 పోస్టులు ఉన్నాయి. పోస్టుల విభజనలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 906, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులు 1,205 ఉన్నాయి.
స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 200 SGT పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 30 ప్రిన్సిపాల్ పోస్టులు, 81 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) పోస్టులు, 113 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టులు, రెండు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 34 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. DSC-2026కు సంబంధించిన సిలబస్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు సిలబస్‌ను పరిశీలించవచ్చు. జిల్లాల వారీగా, సొసైటీల వారీగా ఖాళీల వివరాలను పూర్తి నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. తుది ఖాళీల సంఖ్య, అర్హతలు, దరఖాస్తుల గడువు, పరీక్షల షెడ్యూల్ వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొననున్నారు.
Also Read
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
తాజావార్తలు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!