Rayalaseema Gang: హైదరాబాద్‌లో రాయల సీమ గ్యాంగ్ హల్‌చల్.. ఖరీదైన స్థలం కబ్జా..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాయలసీమ ముఠా హల్‌చల్ చేసింది. ఖరీదైన స్టలం ఆక్రమణకు ప్రయత్నించింది ముఠా. కర్నూల్ జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడిని నాయకత్వంలోని ముఠా ఈ అరాచకానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆదోనికి చెందిన 90మంది రౌడీలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 100 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమించేందుకు ముఠా ప్రయత్నించింది. వంద కోట్ల స్థలం ఆక్రమించేందుకు భూ మాఫియా పడగ విప్పింది. ఫ్యాక్షన్ సినిమా తలపించేలా కిరాయి రౌడీలు మారణాయుధాలతో నగరానికి వచ్చారు. స్థలం ఆదీనంలోకి తెచ్చేందుకు విధ్వంసం సృష్టించారు. కాపలాదారులపై దాడి చేశారు. బుల్డోజర్లు, టస్కర్లు తీసుకువచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. అంతే కాదు కంటైనర్లను స్థలంలోకి దించారు. ఇదంతా కేవలం గంటలోపే జరిగిపోయింది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు సిబ్బందితో స్థలం వద్దకు వెళ్లే సరికి కొంత మంది పారిపోగా 62 మంది కిరాయి రౌడీలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షేక్ పెట్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 403లో 2.5 ఎకరాల ప్రభత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2005లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏపీ జెమ్స్ అండ్ జువెలరీస్ కు కేటాయించింది. ఏపీ జెమ్స్ నిర్వాహకులు సుమారు ఎకరన్నర స్థలంలో నిర్మాణాలు చేశారు. మిగతా స్థలం ఖాళీగానే ఉంచారు. సంస్థ కార్యకలాపాల కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో 10 మంది కాపలాదారులను నియమించింది. ఇదిలా ఉండగా ఖాళీ స్థలం తమదేనంటూ కొంత మంది డాక్యు మెంట్లు సృష్టించారు. స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, సాధ్యం కాలేదు. బంజారాహిల్స్ పీఎస్‌లో కూడా స్థల వివాదంపై కేసులు నమోదు అయ్యాయి. పక్కా స్కెచ్ వేసి.. ఖాళీగా ఉన్న స్థలంపై అనేక మంది కన్ను పడింది. పాతబస్తీకి చెందిన వీవీఆర్ శర్మ అనే వ్యక్తి స్థలం తనదేనంటూ కోర్టులో కేసు కూడా వేశాడు.
Also Read
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
మరోవైపు, శర్మ స్థల అభివృద్ధి కోసం రెండు సంవత్సరాల క్రితం ఏపీకి చెందిన మాజీ ఎంపీ సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌కు చెందిన కంపెనీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశ్వ ప్రసాద్ కంపెనీ ప్రతినిధులు పలు మార్లు స్థలంలోకి వెళ్లి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నించగా ఏపీజెమ్స్ సెక్యూరిటీ అడ్డుకుంటూ వచ్చింది. ఇదిలా ఉండగా వంద కోట్ల స్థలం ఎలాగైన హస్తగతం చేసుకోవాలని విశ్వప్రసాద్ ప్రయత్నాలు ఆరంభించాడు. దీనికి కర్నూల్ జిల్లా అధోనికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులను తన గ్రూపులో చేర్చుకున్నాడు. రాత్రి రాత్రే స్థలాన్ని ఆక్రమించాలని, చూసే వారికి స్థలం తమ ఆధీనంలోనే ఉన్నట్టు కనిపించే విధంగా పథకం సిద్ధం చేశాడు. రాయలసీమ బ్యాచ్‌ను దించాడు.. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశరాఉ.. ఇక, అరెస్ట్ అయిన నిందితులను రెండు డీసీఎంలలో ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లి మెడికల్ టెస్టులు చేయించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర వంద మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
https://www.youtube.com/watch?v=BdN7Is7tLbI
తాజావార్తలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?