హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాయలసీమ ముఠా హల్‌చల్ చేసింది. ఖరీదైన స్టలం ఆక్రమణకు ప్రయత్నించింది ముఠా. కర్నూల్ జిల్లాకు చెందిన ఓ నేత సోదరుడిని నాయకత్వంలోని ముఠా ఈ అరాచకానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఆదోనికి చెందిన 90మంది రౌడీలతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని 100 కోట్ల రూపాయల విలువైన స్థలం ఆక్రమించేందుకు ముఠా ప్రయత్నించింది. వంద కోట్ల స్థలం ఆక్రమించేందుకు భూ మాఫియా పడగ విప్పింది. ఫ్యాక్షన్ సినిమా తలపించేలా కిరాయి రౌడీలు మారణాయుధాలతో నగరానికి వచ్చారు.…