Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో బీసీల కోసం నిర్వహిస్తున్న ధర్నాకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, అయితే బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు? ముస్లింలు బీసీలా? బీసీల రిజర్వేషన్ల సాధన కోసం డిల్లీకి వెళ్లారా, లేక ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికే వెళ్లారా? దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి,” అని రాజాసింగ్ ప్రశ్నించారు.
Suicide: భార్య, అత్తమామల వేధింపులతో అల్లుడి ఆత్మహత్య..! హృదయవిదారక వీడియో..
ప్రస్తుతం ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, మళ్ళీ బీసీ కోటాలో వాటా ఇవ్వడం అన్యాయం అని ఆయన అభిప్రాయపడ్డారు. “బీసీలకు కేంద్ర ప్రభుత్వం 28 శాతం రిజర్వేషన్లు ఇస్తోంది. మీరు ఇస్తున్నది కేవలం 5 శాతం మాత్రమే. దానికోసం ఇంత పెద్ద షో ఎందుకు?” అని అన్నారు. “కాంగ్రెస్ ప్రభుత్వం 42లో 42 శాతం బీసీలకే ఇస్తామని ప్రకటిస్తే మేము కూడా డిల్లీకి వస్తాం. కానీ బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ప్రజలు అయోమయంలో ఉన్నారు, సీఎం వెంటనే స్పష్టత ఇవ్వాలి,” అని రాజాసింగ్ స్పష్టం చేశారు.
iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 5 అప్‌డేట్ విడుదల.. ప్రధాన హైలైట్ “లిక్విడ్ గ్లాస్” డిజైన్