Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో బీసీల కోసం నిర్వహిస్తున్న ధర్నాకు కాంగ్రెస్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, అయితే బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. “42 శాతం బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నారు? ముస్లింలు బీసీలా? బీసీల రిజర్వేషన్ల సాధన కోసం డిల్లీకి వెళ్లారా, లేక ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికే వెళ్లారా? దీనిపై సీఎం రేవంత్…
DK Shivakumar: కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ముస్లిం వర్గాన్ని సంతృప్తి పరచడానికి, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
PM Modi: ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముస్లింల పూర్తి రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించడంపై వివాదం మొదలైంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారి రిజర్వేషన్లను తొలగిస్తామని హామీ ఇస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.