కేంద్రం ప్రభుత్వం జాతీయ నిధుల నుండి nrgs నిధులు మంజూరు చేసిందని రఘునందన్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం కేవలం టీఆర్‌ఎస్ సర్పంచ్‌లకే ఇచ్చారన్నారు. రూ. 53 కోట్ల నిధులు వస్తే మాకు కేవలం 3 కోట్ల నిధులు మంజూరు చేశారని మండిపడ్డారు. Nrgs నిధులు మాకు అన్యాయం జరిగింది.మా నియోజకవర్గ కు ఎన్ని నిధులు రావాలో అవి రావాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
రెండు మూడు నెలలు గడుస్తున్నా సిద్ధిపేట జిల్లాకు కలెక్టర్ లేడు. కనీసం జాయింట్ కలెక్టర్ వినతిపత్రం ఇస్తాం అని వస్తే అధికారులు ఎవ్వరు కార్యాలయంలో లేరని ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదని మండిపడ్డారు. కోట్ల రూపాయల నిధులు పెట్టి కలెక్టరేట్ కడితే ఇక్కడ అధికారులు ఎవ్వరూ లేరని రఘునందన్ రావు అన్నారు. ఉన్నత అధికారులు వచ్చి వినతిపత్రం తీసుకునే దాకా ఇక్కడే నిరసన చేపడతామని రఘునందన్ రావు అన్నారు. ఏ అధికారి ఎలా నివేదిక పంపి నిధులు మంజూరు చేస్తారో మాకు తెలియాలన్నారు.