కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం నాడు హైదరాబాద్ నగరానికి రానున్నారు. తన కుమారుడు రైహాన్‌కు కంటి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ చికిత్స చేయించనున్నారు. నాలుగేళ్ల కిందట రైహాన్ క్రికెట్ ఆడుతున్న సమయంలో కంటికి గాయమైంది. అప్పట్లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రైహాన్‌కు చికిత్స నిర్వహించారు. కానీ ఫలితం లేకపోవడంతో ఎయిమ్స్ వైద్యులు రైహాన్‌ను హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే ఓసారి హైదరాబాద్‌లో చికిత్స పొందిన…