రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అటు తర్వాత ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు పరిచయం చేసుకున్నారు.
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ హాల్‌లో రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు.
Supreme Court: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘బిల్లులను ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి లేదు’’ అని అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతికి గడువు విధించలేమని స్పష్టం చేసింది.
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నవంబర్ 20న తిరుపతికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 21న శ్రీవారి సేవలో పాల్గొననున్నారు.
Droupadi Murmu: పాక్ తప్పుడు ప్రచారాలకు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెక్ పెట్టేశారు. బుధవారం రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్‌తో కలిసి ఫొటో దిగారు. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని.. ఆ విమాన పైలట్ శివాంగి సింగ్‌ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నమని దాయాది దేశం తప్పుడు వార్తలు…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం గగన విహారం చేశారు. అంబాలా వైమానిక దళ కేంద్రం నుంచి రాఫెల్ యుద్ధ విమానంలో విహరించారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌పై భారత్ ప్రయోగించిన రాఫెల్ విమానంలోనే రాష్ట్రపతి ప్రయాణించారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అరుదైన ఘనత సాధించారు. కేరళలోని శబరిమల ఆలయంలో పూజలు చేసిన తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ముర్ము నిలిచారు. 1970లలో వివి గిరి తర్వాత శబరిమల ఆలయాన్ని సందర్శించిన రెండవ రాష్ట్రపతి ముర్మునే. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. ఇరుముడితో వచ్చిన ఆమె అయ్యప్పకు ప్రత్యేక పూజలు చేశారు. Also Read: Success Story: తల్లికి వాగ్దానం చేసి.. 150కి పైగా డిగ్రీలు చేసిన కొడుకు! టర్గెట్ ఏంటో…
రాష్ట్రపతి భవన్ అనగానే గుర్తొచ్చేది ఢిల్లీ. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ రెండు కాకుండా శబరిమలలో కూడా అధికారిక రాష్ట్రపతి భవనం ఉందని ఎంత మందికి తెలుసు. శబరిమలలో రాష్ట్రపతి భవనం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. దీని బ్యాగ్రౌండ్ తెలియాలంటే అయితే ఈ వార్త చదవాల్సిందే.
CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు.
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.