Draupadi murmu: శీతాకాల విడిది కోసం భాగ్యనగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలం రాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆసిఫాబాద్‌లో నూతనంగా నిర్మించిన ఏకలవ్య పాఠశాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. భద్రాచలం, సారపాక మండలాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయలుదేరింది. రాష్ట్రపతి రాత్రి 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేడియానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో ఉదయం 7:50 గంటలకు బయలుదేరి 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 9:50 గంటలకు భద్రాచలంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటుంది. 10:00 గంటలకు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో 10:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.
భద్రాద్రిలో నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక నేపథ్యంలో 2000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. భద్రాచలంలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. భద్రాచలంలో 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు. భద్రాచలం పర్యటనలో రాష్ట్రపతి తో పాటు గవర్నర్ తమిళసై, మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ లు పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంతాలన్నీ అత్యంత సుందర రామనీయంగా అధికారులు తీర్చిదిద్దారు.
Read also: South Indian Cinema-BookMyShow Report: సౌత్ సినిమాల మనీ సునామీ. ఆసక్తికరంగా బుక్‌మైషో రిపోర్ట్
భద్రాద్రి దర్శనం అనంతరం భారత రాష్ట్రపతి దౌపది ముర్ము రామప్ప పర్యటనకు బయలు దేరనున్నారు. రాష్ట్రపతి దౌపది ముర్ము రామప్ప పర్యటనకు సర్వం సిద్ధమైంది. చారిత్రక కట్టడమైన రామప్పకు ఆమె తొలిసారిగా వస్తున్న నేపథ్యం లో అధికార యంత్రాంగం కట్టు దట్టమైన చర్యలు చేపట్టింది. బుధవారం మధ్యాహ్నం 2.20 నుంచి 3.45 గంటల వరకు ఒక గంట 25 నిమిషాలపాటు రాష్ట్రపతి పర్యటన కొనసాగనుంది. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ప్రసాద్ పథకంలో భాగంగా 62 కోట్లు ప్రపంచ వారసత్వ కట్టడం జాబితాలో చేరిన రామప్ప అభివృద్ధికి చేపడుతున్న పనులకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు.. ఆలయ అభివృద్ధి, పదేళ్ల క్రితం తొలగించిన కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులను ఆమె ప్రారంభించనున్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పాత్‌వేల నిర్మాణం, 25 వేల చదరపు మీటర్ల మేర కొరియన్‌గ్రాస్, అంతర్గత మెటల్‌రోడ్ల నిర్మాణం, ఆలయ ఆవరణ అంతా గ్రీనరీగా మార్చే పనులకు సంబంధించి రామప్ప ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు.
Read also: Air India Express: యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ
ఇక రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను ములుగు కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఇప్పటికే ఏరియల్ సర్వే చేపట్టి ల్యాండింగ్ రీహార్సల్ చేశారు. ఇక రాష్ట్రపతితో రామప్ప పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం నుంచే రామప్ప పరిసరాల్లో కేంద్ర భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు 11 మంది తో కూడిన జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కలెక్టర్, ఐజీ, ఎస్పీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు అందులో ఉన్నారు. ఆలయానికి 430 మీటర్ల దూరంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయిన అనంతరం 250 మీటర్ల దూరం గార్డెన్ వరకు ప్రత్యేక కాన్వాయ్‌లో రాష్ట్రపతి వస్తారు. అక్కడి నుంచి స్టోన్ గేట్ వరకు 180 మీటర్ల దూరాన్ని బ్యాటరీ కారులో చేరుకుంటారు. ఇందు కోసం జిల్లా యంత్రాంగం నాలుగు బ్యాటరీ కార్లను తెప్పించింది.
Astrology: డిసెంబర్ 28, బుధవారం దినఫలాలు