ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న ప్రత్యూష బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్ సమీపంలో బొటిక్ నిర్వహిస్తున్నారు. ఆమె శనివారం తన బోటిక్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రత్యూష తండ్రి కృష్ణారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా…