Praja Sangrama Yatra Bandi Sanjay: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నగరంలో వివిధ ప్రాంతాల్లో బండి పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఇవాళ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. జవహర్ నగర్ లో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులను కలిసి, వారి సమస్యలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని బండి సంజయ్ తో దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు సమయానికి అందడం లేదు, నేరుగా ఎకౌంట్లో డబ్బులు పడడం లేదని బండి పలువురు వృద్ధులు తెలిపారు. మాకు పెన్షన్లు రావడం లేదని అన్నారు. మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదని మెరపెట్టుకున్నారు.
మూడు సంవత్సరాల నుండి వికలాంగుల కోసం ఈ కాలనీకి రావలసిన బస్సును కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని అన్నారు. బండి సంజయ్ వారితో మాట్లాడుతూ.. మీకు అండగా మేముంటామని ధైర్యం చెప్పారు. మీ హక్కులకై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులతో బండి సంజయ్ అన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక అర్హులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. అనంతరం దివ్యాంగులు వృద్ధులకు స్టిక్స్, స్టాండ్లను బండి సంజయ్ పంపిణీ చేసారు.
Alia Bhatt : అలియా భట్ కి నిహారిక ఛాలెంజ్