తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. అధికార పక్షం దూకుడు పెంచింది.. వచ్చే నెల నుంచి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు.. అయితే, ఈ విషయంపై స్పందించిన పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసిఆర్ ఎన్నికల రోగం వచ్చినట్లు ఉంది.. అందుకే డ్రామాలు, తమాషాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. పని చేస్తున్నట్లుగా రుజువు చేసుకోవడానికి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. యదాద్రి థర్మల్ విద్యుత్ చూసేందుకు కేసీఆర్ వెళ్లాడు.. ఒక ద్రోహంతో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పలు చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Fraud: దీపం వత్తులు, బొట్టు బిళ్ళల పేరుతో మోసం.. రూ.200 కోట్లు కొట్టేశాడు..!
ఇక, అసెంబ్లీలో గీతాలు గిసి కాళేశ్వరం మొదలు పెట్టాడు.. థర్మల్ విద్యుత్ కేంద్రం పునాది వేసి ఎన్నికల కోసం పవర్ ప్రాజెక్ట్ తెచ్చాం అని మధ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు పొన్నాల.. నాలుగు వేల మెగావాట్ల అంచనా.. ఇప్పటికే 29 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు బొగ్గు ఉన్న ప్రాంతంలో మొదలు పెట్టింది పక్కన పెట్టారని మండిపడ్డారు.. ఈ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్.. యూనిట్‌కి 9 రూపాయలకు పైగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నయాపైసా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఎంటీపీసీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నీ పొగరు బోతు తనం వల్ల కాళేశ్వరం. థర్మల్ ప్లాంట్ మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనే కరెంట్ ఏ ధరకు కొంటున్నారో చెబుతావా? అని సవాల్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క యూనిట్ అయిన కరెంట్ ఉత్పత్తి చేశారా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో సోలార్ పవర్ కి ఉత్పాదక ప్రోత్సాహం ఇచ్చామని గుర్తుచేశారు. ఇరువై నాలుగు గంటల కరెంట్ రైతాంగానికి ఇవ్వడం లేదని దుయ్యబట్టిన ఆయన.. తొమ్మిది పది గంటలకు మించి బోర్లు నడవడంలేదన్నారు.. వనరులు ఉన్న దగ్గర కాకుండా లేని దగ్గర విద్యుత్ ఉత్పత్తి చేయడం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు పొన్నాల లక్ష్మయ్య.
ఎన్నికల ముందు మైనార్టీ, ఎస్సీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు.. బీసీలకు 33 నుంచి 23 శాతానికి కుదించిన నీచ చరిత్ర దేశంలో ఎక్కడా లేదంటూ విరుచుకుపడ్డారు పొన్నాల.. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం జాట్లకు రిజర్వేషన్ పెంచి 50 నుంచి 57 శాతానికి పెంచిందన్న ఆయన.. కర్ణాటకలో అక్టోబర్ 31న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెంచి 54 శాతానికి పెంచారని తెలిపారు.. కానీ, దేశంలో ఎక్కడ లేని విధంగా 88 శాతం బడుగు బలహీన వర్గాల వారు తెలంగాణలో ఉన్నారు.. కానీ, రిజర్వేషన్లు సరైన విధంగా లేవని విమర్శలు గుప్పించారు.. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.