Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
- అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్
- కాళేశ్వరం నిర్మాణంపై బీఆర్ఎస్పై విమర్శలు
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ హామీ
- పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : సిద్దిపేట వేదికగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి కానీ, పేదవాడికి ఒక సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్లే, దాన్ని ఓపెన్ చేసింది వాళ్లే, చివరకు అది కూలిపోయింది కూడా వాళ్ల హయాంలోనేనని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు వాళ్లే కాళేశ్వరం దగ్గరకు పోయి తామేదో చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే కింద ఉన్న ప్రాంతమంతా కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ (NDSA) హెచ్చరించినా, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి
ప్రాజెక్టు కట్టినప్పుడు గత పాలకులకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కాళేశ్వరానికి ఈ గతి పట్టేది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. కేవలం అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపడం ఆపాలని హితవు పలికారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అన్న పెద్దమనిషి (కేసీఆర్) ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. కాళేశ్వరాన్ని ఎలా కట్టారో సమాధానం చెప్పి.. తాము చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి” అని సవాల్ విసిరారు. వారు ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ సభకు వచ్చి కాళేశ్వరంపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
తల తాకట్టు పెట్టి అయినా పేదల ఇళ్ల కల నెరవేరుస్తాం
బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అసంపూర్తిగా కట్టి మధ్యలోనే వదిలేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన ఆ అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్నింటినీ రిపేర్ చేసి త్వరలోనే పేదలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తల తాకట్టు పెట్టి అయినా సరే, అర్హులైన ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..