Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..
- అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు
- భట్టి, ఉత్తమ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారు
- హిల్ట్, టీడీఆర్‌పై తప్పుడు ప్రచారం చేశారు
- నాపైనా నాగోల్, వట్టినాగులపల్లి క్రషర్ అంటూ ఆరోపణలు చేశారు
- వారికి ఉన్న బురదను మాకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. -పొంగులేటి శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యంగా నాదర్‌గుల్ భూముల వ్యవహారం , మంత్రులపై వస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను ‘అబద్ధాల రావు’, ‘డ్రామాల రావు’ అని సంబోధిస్తూ, వారు చేస్తున్న విమర్శలను అసత్యాల పుట్టగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయమని పేర్కొన్న ఆయన, కేరళలో యుడిఎఫ్ (UDF) కూటమి అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేరళ ప్రజలకు వివరించామని, అక్కడ కూడా ప్రజా ప్రభుత్వానికి విశేష ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.
HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!
Also Read
నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నంబర్ 613లో గల 370 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సాక్ష్యాధారాలతో తిప్పికొట్టిన మంత్రి, ఈ భూమి బాగోతం మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. 2014లోనే మూడు సంస్థలకు ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, 2016లో మ్యుటేషన్ పూర్తి చేసింది కూడా గత దొరల పాలనేనని ఆయన గుర్తు చేశారు. గూగుల్ మ్యాప్స్ సాక్ష్యాలను బయటపెడుతూ, 2021 వరకు ఖాళీగా ఉన్న ఈ భూమిలో 2022 నాటికి రోడ్లు నిర్మించి, రేకుల షెడ్లు వేయించింది బీఆర్ఎస్ నాయకులేనని మండిపడ్డారు. ఈ భూమి విషయంలో గత ప్రభుత్వం కోర్టులో కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం వహించిందని, కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 మార్చి 15న ప్రభుత్వ పక్షాన గట్టిగా కౌంటర్ దాఖలు చేసిందని వెల్లడించారు.
Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!
తమ పార్టీ మంత్రులపై బురద జల్లడం ద్వారా తమ కుటుంబ ఆస్తుల పెంపు, పంపకాల చర్చను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. గత పదేళ్లలో వారి ఆస్తులు ఎంత మేర పెరిగాయో ప్రజల్లో చర్చ జరుగుతుందనే భయంతోనే ‘శకుని మామ’ (హరీష్ రావు) వంటి వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలపై బియ్యం స్కామ్ అంటూ తప్పుడు నిందలు వేస్తున్నారని, సన్న బియ్యం పథకానికి వస్తున్న ప్రజాదరణను వారు తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ఏదైనా కమిటీ వేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమని ప్రకటించినప్పుడు సమాధానం చెప్పలేక తోక ముడిచి పారిపోయిన వారు, ఇప్పుడు బయట డ్రామాలు ఆడుతున్నారని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!