Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA – హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. హైడ్రాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్ పోస్టులు ఉండగా, మిగిలిన 50 హెవీ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. విద్యా అర్హతల విషయానికొస్తే పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. డ్రైవర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా శారీరక సామర్థ్య పరీక్షల (Physical Tests) ఆధారంగానే జరుగుతుంది. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో (170 సెకన్లు), 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ , 7.2 కేజీల షాట్పుట్ను 6 మీటర్ల దూరం విసరడం లాంటి భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఆసక్తి, తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు , పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8 , 9వ తేదీల్లో ఉదయం 5:00 గంటల నుంచి నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!