ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్ సహా పురపాలక చట్టాల సవరణ చేయనున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పునరుద్ధరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంది. 1. ప్రపంచంలోనే…
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. తాజాగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
BC Reservation : హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతిని వ్యక్తిగతంగా కలసి ఆమోదం పొందేందుకు వచ్చే నెల 5, 6, 7 ఆగస్టు తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్ళాలని తేల్చింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రివర్గం వివరాల ప్రకారం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆగస్టు…
ఈ నెల 5 న కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమవేశమైన కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్ జీవో , టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే…