MLA Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్ ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇతర వర్గాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఎస్ఐ వీరబాబు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌పై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
కాగా, ఇటీవల ముంబైలోనూ రాజా సింగ్‌పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. జనవరి 29న ముంబైలో జరిగిన ర్యాలీలో రాజా సింగ్ విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శివాజీ పార్క్ లేబర్ బోర్డు కార్యాలయం మధ్య హిందూ సకల్ సమాజ్ నిర్వహించిన ర్యాలీలో రాజా సింగ్ ప్రసంగాన్ని చూసిన తర్వాత దాదర్ పోలీస్ స్టేషన్ అధికారి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు IPC 153A(I)(a) కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ముంబైలో జరిగిన ర్యాలీలో రాజా సింగ్ దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో అతను ‘లవ్-జిహాద్’ యొక్క కుట్ర సిద్ధాంతం గురించి మాట్లాడాడు మరియు “ఇది హిందూ సమాజం కలిసి ఒక సంఘం ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడవలసిన సమయం. మన సోదరీమణులు మరియు కుమార్తెలు ఒక సంఘం యొక్క ఈ వ్యవస్థీకృత పథకాలకు బలి అవుతున్నారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుండి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయడాన్ని బహిష్కరించాలని నేను ప్రతి హిందువును కోరుతున్నాను’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఇది ఇలా ఉండగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ శాసనసభ్యుడు రాజా సింగ్‌ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఆయన ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌పై బయట వచ్చిన విషయం తెలిసిందే. అయితే అటు ముంబై, ఇట్లు తెలంగాణలో మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో సంచలనంగా మారింది. మరి రాజా సింగ్ మళ్లీ జైలుకు వెళతారా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
IPL 2023: గుజరాత్ టైటాన్స్ కు షాక్ ఐపీఎల్ మొత్తానికి కేన్ విలియమ్సన్ దూరం..