CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. రూ. 9377 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్ఐసీసీలో జరిగే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది అభివృద్ధి ఉత్సవం అని , తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధి మనకు అత్యంత ప్రాధాన్యం అని, ముందు భారతదేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అని సీఎం అన్నారు. ఆ స్పూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధాని మోడీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించారని, మేము కూడా అందులో భాగస్వాములమయ్యామని, తెలంగాణ రైజింగ్ మోడీ పూర్తిగా సహకరిస్తారనే విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు.
Also Read
- CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
- CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
Read Also: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు తాము ప్రయత్నిస్తు్న్నామని, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించడానికి మోడీ వచ్చారని సీఎం అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయని, ప్రధాని మోడీ ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వచ్చారని, ఇక మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని చెప్పారు.
ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎలా సహకరించారో, తెలంగాణ ప్రజలు కూడా రాబోయే 10 ఏళ్లలో మీ సహకారంతో రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. నాడు గుజరాత్‌కు మన్మోహన్ సింగ్ సహకరించినట్లే, ప్రధాని మోడీ ఇప్పుడు తెలంగాణకు సహకరిస్తారని విశ్వసిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్, హైదరాబాద్ వంటి మహా నగరాలు ఉన్నాయని, దేశంలో అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగాలు రావాలన్ని ఈ మహా నగరాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రుల్ని, మిమ్మల్ని కలిశామని కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు ఆమోదాలు అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. మోడీది పెద్ద మనుసు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి చెబుతున్నారు, తెలంగాణ విషయంలో పెద్ద మనసు చూపాలని సీఎం కోరారు.
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!