TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్‌కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Nashik Case: నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలుగా ఉన్న నిదా ఖాన్ ఇటీవలే పట్టుబడింది. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. రెండు రోజుల క్రితం ఛత్రపతి సంభాజీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుబడింది. ఆమె ఆచూకీ తెలియకుండా ఉండేందుకు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ సహకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఇళ్లు మతీన్ పటేల్‌కు చెందినదని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ విచారణ తర్వాత దాని యజమానులు హనీఫ్ ఖాన్, సయ్యద్ సర్వార్ అని తేలింది. వీరిద్దరు ఆ ఇంటిని రూ. 23 లక్షలకు కొనుగోలు చేశారు.
Read Also: Kerala CM: కేరళ కాంగ్రెస్‌లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
నిదా ఖాన్ ఇక్కడే ఉంటుందని తమకు ఏ మాత్రం తెలియదని ఇంటి యజమానులు వాదిస్తున్నారు. కొన్ని రోజుల పాటు తన ఇంట్లో అతిథులు ఉంటారని మతీన్ పటేల్ చెప్పాడని, అందుకే ఇంటిని అద్దెకు ఇచ్చినట్లు చెబుతున్నారు. నిదా ఖాన్‌కు ఈ ఇళ్లు ఆశ్రయం ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఇంటికి నోటీసులు జారీ చేసింది. ఛత్రపతి సంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఇంటిని అక్రమమని ప్రకటించి, మూడు రోజుల్లోగా కూల్చివేయాలని నోటీసు జారీ చేసింది. ఈ ఇంటి నిర్మాణం అక్రమమని అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో నిదా ఖాన్ కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. డానిష్ అనే ఉద్యోగి తనకు వివాహం అయిందనే విషయాన్ని దాచిపెట్టి ఒక యువతితో స్నేహం చేశాడు. ఆ సమయంలో ఇస్లాం మతంలోకి మారాలని ఆమెపై ఒత్తిడి వచ్చింది. నిదా ఖాన్ బాధితురాలికి మాయమాటలు చెప్పి, మతపరమైన ఆచారాలు పాటించేలా బలవంతం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మతపరమైన యాప్‌లు మొబైల్‌లో డౌన్లోడ్ చేసి, హిజాబ్ ధరించడం, కల్మా పఠించడం వంటికి నేర్పించింది. ఆమె పేరును ‘‘హనియా’’ మార్చింది. ఈ మొత్తం నెట్వర్క్‌కు అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ అజయ్ మిసర్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిదా ఖాన్‌కు సహకరించిన మతీన్ పటేల్‌న సహ నిందితుడిగా తేల్చారు. కోర్టు నిదాఖాన్ ను మే 11 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!