దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటిపోయింది. తాజాగా, లీటర్ పెట్రోల్‌పై 35 పైసులు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం వివిధ ప్రాంతాల్లో పెట్రోలట్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
Read: ఈషా రెబ్బా చేత ‘అబ్బా’ అనిపించిన… ‘పొడుగు కాళ్ల సుందరి’!
హైదరాబాద్ః లీటర్ పెట్రోల్ ధర రూ.103.05, డీజిల్ ధర రూ.97.20
విజయవాడః లీటర్ పెట్రోల్ ధర రూ.105.17, డీజిల్ ధర రూ.98.73.
గుంటూరుః లీటర్ పెట్రోల్ ధర రూ.105.37, డీజిల్ ధర రూ.98.93.
దేశ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఆందోళనలు చేస్తున్నారు. ధరలు ఇలానే పెరిగితే ప్రయాణాలు చేయడం కష్టంగా మారుతుందని, వాహనాలు నడపలేమని అంటున్నారు. చమురు ధరలు పెరగడంతో సొంత వాహనాలను పక్కనపెట్టి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లను ఆశ్రయిస్తున్నారు.