Father of Mulugu DSP: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం దోమలకుంట శివారులో జాతీయ పక్షి నెమలి వేటాడిన ఘటన కలకలం రేపింది. ములుగు డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న తండ్రిని పెగడపల్లి పోలీసుల అదుపులో తీసుకున్నారు. పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామశివారులో గన్ తో డీఎస్పీ తండ్ర సత్యనారాయణ వేటకి వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అయితే.. పోలీసుల తనికీల్లో నెమలి కళేబరం, వేటకి వాడిన తుపాకీ పట్టుబడ్డాయి. దీంతో సత్యనారాయణను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: Ahobilam: ఘనంగా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…!
మన దేశంలో నెమలి, జింక వంటి వన్యప్రాణులను వేటాడటం నిషేధం. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా 2017లో మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జింకల వేట కేసులో సత్యనారాయణకు కూడా సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ముగియడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్చి 25లోగా లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం తుపాకులను వెనక్కి తీసుకోవచ్చని చెబుతున్నారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రికి లైసెన్స్ గన్ ఇచ్చిన వేటకు పంపిన ములుగు డీఎస్పీ పై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైసెన్స్ గన్ ను కుటుంబ సభ్యులకు ఎలా ఇస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనిపై ములుగు డీఎస్పీ ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి ఒరిజినల్ వెర్షన్ కాదా.. అన్ని మార్పులు చేసారా..?